Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • మోడల్ నంబర్ KJ8
  • బ్లూటూత్ 5.3 సపోర్ట్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Tecno Spark 20 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి Tecno Spark 20 Pro 5G యొక్క బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై KJ8 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. డిక్లరేషన్ ఐడీ-డీ066748 గా ఉంది.

Tecno Spark 20 Pro 5G డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై Tecno Spark 20 Pro 5G కనిపించడంతో లాంచ్ దగ్గరలోనే ఉందని అర్థమవుతోంది. కాగా, గతేడాది Tecno Spark 20 Pro 4G లాంచ్ అయ్యింది. త్వరలో 5జీ వర్షన్ యూజర్లను పలకరించనుంది.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఇప్పటి వరకు Tecno Spark 20 Pro 5G గురించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. త్వరలోనే మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.