TECNO: Geekbench పై లిస్టైన Tecno Phantom V2 Fold 5G; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Phantom V2 Fold
  • Phantom V Fold కి సక్సెసర్‌గా వస్తోన్న V2 Fold
  • Dimensity 9000+ చిప్సెట్‌తో రానున్న డివైజ్

Tecno కంపెనీ త్వరలో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Phantom V2 Fold పేరుతో ఇది లాంచ్ కానుంది. గత మోడల్ Tecno Phantom V Fold కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Tecno Phantom V2 Fold కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V2 Fold 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Tecno నుంచి రాబోవు కొత్త ఫోల్డబుల్ ఫోన్ Tecno Phantom V2 Fold గీక్‌బెంచ్ డేటాబేస్ పై AE10 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Tecno Phantom V2 Fold సింగిల్-కోర్ టెస్ట్ లో 1,273 పాయిట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,844 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Tecno Phantom V2 Fold మదర్‌బోర్డ్ XYZ-MARS అనే కోడ్ నేమ్ కలిగి ఉంది.
  • చిప్సెట్ విషయానికి వస్తే, గరిష్టంగా 3.20 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • వివరాలను బట్టి, Tecno Phantom V2 Fold లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడినట్లు అర్థమవుతోంది.
  • గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Tecno Phantom V2 Fold డివైజ్ 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • Tecno Phantom V2 Fold డివైజ్ లిస్టింగ్ పై ఆండ్రాయిడ్ 14 తో కనిపిస్తోంది.

Tecno Phantom V Fold స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ లో 6.42-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే, 10హెర్ట్జ్-120 హెర్ట్జ్ డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఫోన్ ని ఓపెన్ చేస్తే 7.65-ఇంచ్ 2కే అమోలెడ్ భారీ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Phantom V Fold లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఇచ్చారు. ఇది ఔటర్ డిస్ప్లే పై ఉంటుంది. మెయిన్ డిస్ప్లే పైన 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Tecno Phantom V Fold లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ 5జీ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Fold 12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది.
  • ఓఎస్: Tecno Phantom V Fold డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఫోల్డబుల్ డిజైన్ కి సరిపోయే విధంగా ఓఎస్ ని కస్టమైజ్ చేయడం జరిగింది.
  • కనెక్టివిటీ: Tecno Phantom V Fold లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.