TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో TECNO Phantom V2 Flip లాంచ్
  • డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ AE11

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO Phantom V2 Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. గత మోడల్ TECNO Phantom V Flip కి సక్సెసర్ గా TECNO Phantom V2 Flip ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

TECNO Phantom V2 Flip డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై AE11 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

TECNO Phantom V2 Flip డివైజ్ 4590 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.

8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఫాంటమ్ వీ2 ఫ్లిప్ లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఈసారి వస్తోన్న TECNO Phantom V2 Flip డివైజ్ డిజైన్ లో మార్పులు ఉంటాయని సమాచారం. కెమెరా విభాగంలో ఈ మార్పు జరగనుంది. సర్క్యులర్ మాడ్యూల్ కి బదులుగా, వెర్టికల్ (నిలువు) గా కెమెరా సెన్సర్స్ ఉండనున్నాయి.

TECNO Phantom V2 Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా చిప్సెట్ వివరాలు రివీల్ అయ్యాయి.

TECNO Phantom V2 Flip డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

TECNO Phantom V2 Flip డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 814 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2866 పాయింట్లు స్కోర్ చేసింది.

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ మరిన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.