మీడియాటెక్ చిప్సెట్స్, అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Tecno Camon 20 సిరీస్

Highlights

  • నైజీరియాలో లాంచైన Tecno Camon 20 సిరీస్
  • మీడియాటెక్ చిప్సెట్స్ తో వచ్చిన డివైజెస్
  • కేమాన్ 20 సిరీస్ ప్రారంభ ధర NGN 133,300 (సుమారు రూ.23,800)

Tecno Camon 20 సిరీస్ అఫీషియల్ గా లాంచైంది. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Camon 20, Camon 20 Pro, Camon 20 Pro 5G, Camon 20 Premier. ఈ ఫోన్లు మ్యాజిక్ స్కిన్ అనే ఫీచర్ తో వచ్చాయి. ఈ సరికొత్త మెటీరియల్ టెక్నాలజీ.. స్కిన్ ఫ్రెండ్లీ మరియు క్లీన్ చేయడానికి తేలికగా ఉంటుంది. ఈ టెక్నాలజీని త్వరలో రాబోవు Camon, Spark, Pop సిరీస్ ఫోన్లలో కూడా ఉపయోగిస్తామని టెక్నో సంస్థ తెలిపింది.

ఇకపోతే Camon 20 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ చిప్సెట్స్, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి.

Tecno Camon 20 సిరీస్ ధర, లభ్యత

  • Tecno Camon 20 ధర NGN 133,300 (సుమారు రూ.23,800) గా ఉంది. ఈ ఫోన్ ప్రీ‌డాన్ బ్లాక్, సెరెనిటీ బ్లూ మరియు గ్లేసియర్ గ్లొ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Tecno Camon 20 Pro ధర NGN 155,400 (సుమారు రూ.27,700) గా ఉంది. ఈ పోన్ ప్రీడాన్ బ్లాక్ మరియు సెరినిటీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభస్తుంది.
  • Tecno Camon 20 Pro 5G మరియు Camon 20 Premier 5G ఫోన్ల ధరలు వరుసగా NGN 199,900 (సుమారు రూ.35,600) మరియు NGN 295,500 (సుమారు రూ.52,600) గా ఉన్నాయి. ఈ ఫోన్లు సెరెనిటీ బ్లూ మరియు డార్క్ వెల్కిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • ఈ ఫోన్లు ప్రస్తుతం నైజీరియాలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా, సౌత్‌ఈస్ట్ ఏషియా, సదరన్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ లోకి ఈ సిరీస్ ప్రవేశించనుంది.

Tecno Camon 20 Premier, Camon 20 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే, చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • అమోలెడ్
  • డైమెన్సిటీ 8050
  • 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్
  • 512జిబి

Tecno Camon 20 ప్రీమియర్ మరియు Tecno Camon 20 ప్రో 5జీ ఫోన్లలో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 6ఎన్ఎం ప్రాసెసర్, ఏఆర్ఎం జీ77 ఎంసీ9 జీపీయూ ఉన్నాయి. Tecno Camon 20 ప్రో లో 256జిబి స్టోరేజీ, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉన్నాయి. Tecno Camon 20 ప్రీమియర్ లో 512జిబి స్టోరేజీ, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్
  • 5జీ, 4జీ వొల్టీ

Tecno Camon ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఈ ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ప్రీమియర్ మోడల్ లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ప్రో వేరియంట్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Camon 20 Premier కెమెరా

  • 50ఎంపి ప్రైమరీ
  • 108ఎంపి అల్ట్రావైడ్

Camon 20 Premier స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Camon 20 Pro 5G కెమెరా

  • 64ఎంపి
  • 32ఎంపి

Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Tecno Camon 20, Camon 20 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • అమోలెడ్ ప్యానెల్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Tecno Camon 20, Camon 20 Pro ఫోన్లలో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్

  • హీలియో జీ85
  • హీలియో జీ99

Tecno Camon 20 లో మీడియాటెక్ హీలియో జీ85 12ఎన్ఎమ్ చిప్, మాలి-జీ52 2ఈఈఎంసీ2 జీపీయూ ఉన్నాయి. Tecno Camon 20 Pro లో మీడియాటెక్ హీలియో జీ99 6ఎన్ఎం ప్రాసెసర్, ఏఆర్ఎం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ, ఓఎస్

  • 8జిబి ర్యామ్
  • ఆండ్రాయిడ్ 13
  • 256జిబి స్టోరేజీ

Tecno Camon 20, Camon 20 Pro ఫోన్లలో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Tecno Camon 20 కెమెరాలు

  • 64ఎంపి ప్రైమరీ
  • 2ఎంపి+ఏఐ

Tecno Camon 20 డివైజ్ లో 64ఎంపి ప్రైమరీ ఆర్జీబీడబ్ల్యూ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ కెమెరా, క్వాడ్-ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Tecno Camon 20 Pro కెమెరాలు

  • 64ఎంపి ప్రైమరీ
  • 32ఎంపి సెల్ఫీ

Tecno Camon 20 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, కనెక్టివిటీ

  • 5000ఎంఏహెచ్
  • డ్యూయల్ 4జీ వొల్టీ

Tecno Camon ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. అలాగే డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

భద్రత కోసం ఈ ఫోన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ డివైజెస్ లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.