6.67-ఇంచ్ AMOLED డిస్ప్లే, Dimensity 8050 చిప్‌తో భారత్‌లో లాంచైన Tecno Camon 20 Premier 5G

Highlights

  • 4700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Tecno Camon 20 Premier 5G ధర రూ.29,999
  • జులై 15 న అమెజాన్ లో మొదలుకానున్న సేల్

బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి ఫీచర్లతో ఫోన్లను తీసుకొస్తూ యూజర్ల ఆదరణ పొందుతోంది టెక్నో సంస్థ. ఈ కంపెనీ తాజాగా భారతీయ మార్కెట్ లో Tecno Camon 20 Premier 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే ఈసారి లో-బడ్జెట్ కాకుండా, మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఫోన్ ని తీసుకొచ్చింది. Tecno Camon 20 Premier 5G డివైజ్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Camon 20 Premier 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Camon 20 Premier 5G ధర, కలర్ ఆప్షన్స్

Tecno Camon 20 Premier 5G స్మార్ట్ ఫోన్ సెరినిటీ బ్లూ, డార్క్ వెల్కిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు. ప్రస్తుతం టెక్నో సంస్థ సేల్ తేదీని వెల్లడించలేదు. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 15 నుంచి మొదలు కానుంది. ఇదే రోజున Tecno Camon 20 Premier 5G సేల్ కూడా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Tecno Camon 20 Premier 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: Tecno Camon 20 Premier 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno Camon 20 Premier 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ77 ఎంసీ9 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 20 Premier 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Tecno Camon 20 Premier 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Camon 20 Premier 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. అల్ట్రావైడ్ కెమెరా మ్యాక్రో షాట్స్ కూడా తీసేందుకు ఉపయోగడుతుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Tecno Camon 20 Premier 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Camon 20 Premier 5G లో 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2 కస్టమ్ స్కిన్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.