Telugu News - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 10:04:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/#respond Thu, 27 Jun 2024 10:04:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12248 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Lite […]

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Lite లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite ధర

Vivo T3 Lite డివైజ్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 Lite యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రోజు సేల్‌లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత బేస్ మోడల్ ధర రూ.9,999 కి, టాప్ మోడల్ ధర రూ.10,999 కి మారుతాయి.

జులై 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ను కొనుగోలుకి చేయవచ్చు.

Vivo T3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/feed/ 0
Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-256gb-variant-launched-india/ Thu, 01 Feb 2024 10:00:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10026 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G 256GB
  • Vivo Y200 5G 256GB ధర రూ.23,999
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G 256GB ధర

  • Vivo Y200 5G 256GB స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ చేశారు.
  • Vivo Y200 5G 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.
  • Vivo Y200 5G కొనుగోలుపై ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 https://www.91mobiles.com/telugu/tecno-spark-20-launched-india-32mp-front-camera/ Tue, 30 Jan 2024 12:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9978 తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 […]

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Tecno Spark 20
  • 16జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20 ధర రూ.10,499

తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ధర, సేల్

  • Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Tecno Spark 20 ధరను భారత్ లో రూ.10,499 గా నిర్ణయించారు. Tecno Spark 20 డివైజ్ బ్లాక్, గోల్డ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 2 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • Tecno Spark 20 ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.4,897 విలువగల ఓటీటీ ప్లే ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 19 ఓటీటీ యాప్స్ కంటెంట్ ని ఈ సబ్‌స్క్రిప్షన్ పై ఎంజాయ్ చేయవచ్చు.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ మాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ ఇచ్చారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ53 రేటింగ్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్ ఉన్నాయి.

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro https://www.91mobiles.com/telugu/infinix-note-40-note-40-pro-listed-on-google-play-console-website/ Fri, 19 Jan 2024 16:14:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9811 Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 […]

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Note 40, Note 40 Pro
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న రెండు డివైజెస్

Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40, Infinix Note 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • Infinix Note 40 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Infinix Note 40 Pro డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6850 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లు 8జిబి వరకు ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి.
  • చిప్సెట్ MT6789V/CD అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. అంటే ఇది మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ అయ్యుంటుందని భావించవచ్చు.
  • రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానున్నాయి.
  • గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై రెండర్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ల లుక్ రివీల్ అయ్యింది.
  • రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ని కలిగి ఉన్నాయని రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు డివైజెస్ లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ లో 1080*2436 పిక్సెల్స రెజుల్యూషన్ గల డిస్ప్లే, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 8జిబి వరకు ర్యామ్, బేస్ మోడల్ 128జిబి స్టోరేజీతో రానున్నాయి.
  • కెమెరా: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇవి 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>