Redmi 12 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 08:26:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Redmi 12 4G: గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 12 4జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-12-4g-globally-launched-know-full-details/ https://www.91mobiles.com/telugu/redmi-12-4g-globally-launched-know-full-details/#respond Thu, 27 Jun 2024 08:26:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12245 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక 4జీ ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi 12 4G పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ లో విడుదలైంది. తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ సూట్ అవుతుంది. ఇకపోతే, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ 12 4జీ […]

The post Redmi 12 4G: గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 12 4జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పాకిస్తాన్‌లో లాంచైన Redmi 12 4G
  • 128జిబి/256జిబి స్టోరేజీ
  • ధర PKR 59,000 (రూ.17,900)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక 4జీ ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi 12 4G పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ లో విడుదలైంది. తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ సూట్ అవుతుంది. ఇకపోతే, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ 12 4జీ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 12 4G ధర

Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ ధర పాకిస్తాన్ లో ఎలా ఉందో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర PKR 59,000 (సుమారు రూ.17,900) గా ఉంది. రెడ్మీ 12 4జీ డివైజ్ స్కైలైన్ సిల్వర్ మరియు పయనీర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Redmi 12 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 12 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Redmi 12 4G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ ని ఆఫర్ చేశారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 12 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 12 4G లో ఐపీ54 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi 12 4G: గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 12 4జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-12-4g-globally-launched-know-full-details/feed/ 0
6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-12-4g-launched-india-price-specs-availability/ Tue, 01 Aug 2023 11:00:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=7412 షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ అభిమానులకు నేడు పండుగేనని చెప్పాలి. రెడ్మీని ఏళ్ళుగా ఆదరిస్తోన్న యూజర్ల కోసం సదరు సంస్థ రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లో Redmi 12 4G, Redmi 12 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 4G గురించి తెలుసుకుందాం. Redmi 12 4G డివైజ్ ధర రూ.9,999 తో ప్రారంభమవుతుంది. Redmi 12 4G ధర Redmi 12 4G […]

The post 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi 12
  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వచ్చిన ఫోన్
  • ఫోన్ కొనుగోలుపై రూ.1000 ఆఫర్ ప్రకటించిన కంపెనీ

షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ అభిమానులకు నేడు పండుగేనని చెప్పాలి. రెడ్మీని ఏళ్ళుగా ఆదరిస్తోన్న యూజర్ల కోసం సదరు సంస్థ రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లో Redmi 12 4G, Redmi 12 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 4G గురించి తెలుసుకుందాం. Redmi 12 4G డివైజ్ ధర రూ.9,999 తో ప్రారంభమవుతుంది.

Redmi 12 4G ధర

Redmi 12 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. మరోవైపు, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. అయితే ఆఫర్ లో భాగంగా ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో 4జిబి ర్యామ్ మోడల్ ని రూ.8,999 కి, 6జిబి ర్యామ్ మోడల్ ని రూ.10,499 కి సొంతం చేసుకోవచ్చు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ ఎల్సీడీ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • చిప్సెట్: Redmi 12 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: Redmi 12 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi 12 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అందించారు. దీంతో యూజర్ కి అదనపు ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Redmi 12 4G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 27 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • కనెక్టివిటీ: Redmi 12 4G లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi 12 4G డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ53 రేటింగ్ తో రావడం వల్లన డస్ట్, వాటర్ నుంచి పాక్షికంగా ప్రొటెక్షన్ లభించనుంది.

The post 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! https://www.91mobiles.com/telugu/redmi-12-4g-redmi-12-5g-price-ram-storage-leaked-before-launch/ Tue, 25 Jul 2023 05:31:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=7306 షావోమి సంస్థ భారత్ లో త్వరలోనే Redmi 12 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 1 న ఈ రెండు డివైజెస్ లాంచ్ కానున్నాయి. అవి: Redmi 12 4G, Redmi 12 5G. రెడ్మీ 12ఆర్ ని రీబ్రాండ్ చేసిన Redmi 12 5G ని తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Redmi 12 4G ఇప్పటికే థాయిల్యాండ్ లో లాంచ్ అయ్యింది. డివైజ్ కూడా ఫ్లిప్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ తో వస్తోన్న Redmi 12 4G
  • Redmi 12 4G అంచనా ప్రారంభ ధర రూ.9,999
  • 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ తో రానున్న Redmi 12 5G

షావోమి సంస్థ భారత్ లో త్వరలోనే Redmi 12 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 1 న ఈ రెండు డివైజెస్ లాంచ్ కానున్నాయి. అవి: Redmi 12 4G, Redmi 12 5G. రెడ్మీ 12ఆర్ ని రీబ్రాండ్ చేసిన Redmi 12 5G ని తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Redmi 12 4G ఇప్పటికే థాయిల్యాండ్ లో లాంచ్ అయ్యింది. డివైజ్ కూడా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుందని బ్రాండ్ ఖరారు చేసింది.

Redmi 12 4G డివైజ్ జేడ్ బ్లాక్, పేస్టల్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. లాంచ్ కోసం వేచి చూస్తున్న తరుణంలో, టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ డివైజ్ ధర వివరాలు షేర్ చేసారు.

లీకైన Redmi 12 4G, Redmi 12 5G ధరలు

టిప్‌స్టర్ ప్రకారం, Redmi 12 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.13,999 నుంచి మొదలవుతుందని సమాచారం. మరోవైపు Redmi 12 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Redmi 12 4G ధర రూ.9,999 తో మొదలవుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 4G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, 70 పర్సెంట్ కలర్ గేముత్, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Redmi 12 4G లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12 4G డివైజ్ లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • రియర్ కెమెరా: Redmi 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Redmi 12 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12 4G డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్-సిమ్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>