Realme Note 60 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 30 Jun 2024 17:32:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/ https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/#respond Sun, 30 Jun 2024 17:31:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=12297 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్ Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై […]

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme Note 60 లాంచ్
  • UniSoc T612 ప్రాసెసర్
  • మోడల్ నంబర్ RMX3933

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై RMX3933 మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 432 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1341 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme Note 60 డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.82 గిగాహెర్ట్జ్. ఇక ఈ ఫోన్ మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తోంది.

ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో గీక్‌‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Realme Note 60 ఇతర సర్టిఫికేషన్స్ వివరాలు

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ మరియు టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. అయితే బీఐఎస్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే, నోట్ సిరీస్‌ను భారత్ లో లాంచ్ చేయమని రియల్మీ గతంలో తెలిపింది. దీన్ని బట్టి, Realme Note 60 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు తక్కువేనని అనుకోవచ్చు.

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/feed/ 0