Realme GT 7 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jun 2024 18:21:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/#respond Fri, 28 Jun 2024 18:21:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=12287 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ చేయబోతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. రియల్మీ జీటీ 7 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 1.5కే మైక్రో-కర్వ్‌డ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ చేయబోతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. రియల్మీ జీటీ 7 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది. అయితే టిప్‌స్టర్ నేరుగా ఫోన్ పేరును కన్ఫర్మ్ చేయలేదు. కానీ, కామెంట్స్ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

లీక్ ప్రకారం, Realme GT 7 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme GT 7 Pro డివైజ్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుంది.

Realme GT 7 Pro డివైజ్ ఎక్స్‌ట్రా లార్జ్ సిలికాన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో సింగిల్-పాయింట్ అల్ట్రా‌సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో రానున్నట్లు లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఇతర ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ లో కూడా డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన Realme GT 5 Pro డివైజ్‌కి సక్సెసర్‌గా Realme GT 7 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్ లో రియల్మీ జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/feed/ 0
Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-timeline-revealed/ Wed, 29 May 2024 13:32:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=11789 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె GT 6T స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు జీటీ సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ని అఫీషియల్ గా వెల్లడించారు. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. Realme GT 7 Pro ఇండియా […]

The post Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • ఇండియా టైమ్‌లైన్ ప్రకటన
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె GT 6T స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు జీటీ సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ని అఫీషియల్ గా వెల్లడించారు. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్

సోషల్ మీడియాలో ఒక యూజర్ Realme GT 7 Pro ఇండియా లాంచ్ ఎప్పుడని చేస్ జూ ని ప్రశ్నించగా, ఆయన ఈ ఏడాది భారత్ లో జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని బదులిచ్చారు. ఈ ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. అంటే అదే సమయంలో భారత్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.

త్వరలో Realme GT 6 గ్లోబల్ లాంచ్

మరోవైపు రియల్మీ సంస్థ, రియల్మీ జీటీ 6 డివైజ్‌ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ పై ఇంకా ప్రకటన రాలేదు.

రియల్మీ సంస్థ తన గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా Realme GT 6 గ్లోబల్ లాంచ్‌ని టీజ్ చేసింది. అయితే లాంచ్ తేదీని వెల్లడించలేదు. వచ్చే నెలలో లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టీజర్ పోస్ట్ లో కెమెరా స్పెసిఫికేషన్స్, డివైజ్ పేరుని కంపెనీ షేర్ చేసింది.

ఈ ఫోన్ 47ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఎఫ్/2.0 అపర్చర్, 1/100s షటర్ స్పీడ్, ఐఎస్ఓ 320 వంటి ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Realme GT 6 ఇదివరకు ఎఫ్‌సీసీ మరియు యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Realme GT 6 డివైజ్ గీక్‌బెంచ్ పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 735 జీపీయూ, 16జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.

Realme GT 6 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

రియల్మీ జీటీ 6 ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందింది. అంటే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.

The post Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>