Nokia - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Feb 2024 11:45:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! https://www.91mobiles.com/telugu/9-hmd-phones-listed-on-imei-database/ Mon, 05 Feb 2024 17:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10096 HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి. త్వరలో లాంచ్ కానున్న 9 HMD […]

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • ఒకేసారి 9 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజెస్

HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.

త్వరలో లాంచ్ కానున్న 9 HMD స్మార్ట్‌ఫోన్లు

  • HMD సంస్థ ప్రస్తుతం 11 ఉత్పత్తులపై పని చేస్తున్నట్లు GSMChina తన కథనం ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా ఐఎంఈఐ డేటాబేస్ పై 9 డివైజెస్ లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన TA-1584, TA-1588, TA-1589, TA-1592, TA-1594, TA-1595, TA-1602, TA-1605 మరియు TA-1631 డివైజెస్ ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, HMD ఫోన్ 108ఎంపి ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • వచ్చే నెల జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో HMD ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

HMD చేయబోయేదేంటి?

  • HMD గ్లోబల్ సంస్థ వద్ద Nokia లైసెన్స్ వ్యవధి 2026 వరకు ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం, HMD కంపెనీ రానున్న రోజుల్లో నోకియా మరియు HMD పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.
  • 2024 లో లాంచ్ కాబోయే Nokia ఫోన్లు ఆఫ్-లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు, HMD బ్రాండ్ ఫోన్లు ఆన్‌లైన్ మార్కెట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్ట్రేటజీ వల్లన ఫోన్ల యొక్క ధరలపై కూడా ప్రభావం ఉంటుంది.
  • ఆన్‌లైన్ లో లభించే హెచ్ఎండీ ఫోన్లు సరసమైన ధరలకు లభించగా, ఆఫ్‌లైన్ మార్కెట్ లో లభించే నోకియా ఫోన్లు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి.

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
కొత్త పేటెంట్ క్రాస్-లైసెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన Nokia, Apple సంస్థలు https://www.91mobiles.com/telugu/nokia-and-apple-signs-new-patent-cross-license-agreement/ Tue, 04 Jul 2023 04:27:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=7048 ప్రముఖ కంపెనీ Nokia మరొక దిగ్గజ సంస్థ Apple తో కొత్త పేటెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ ని చేసుకున్నట్లు ప్రకటించింది. 2017 మే నెలలో ఇరు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం 2023 చివరికల్లా పూర్తవుతుంది. ఈ తరుణంలో నోకియా మరియు ఆపిల్ సంస్థలు తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. ఈ కొత్త పేటెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది 5జీ లో నోకియా చేసిన ఆవిష్కరణలు మరియు […]

The post కొత్త పేటెంట్ క్రాస్-లైసెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన Nokia, Apple సంస్థలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2017 మే లో కుదిరిన ఇరు కంపెనీల మధ్య ఒప్పందం
  • 2023 ఆఖరి కల్లా ముగియనున్న గత ఒప్పందం
  • తాజాగా కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేసిన ఇరు కంపెనీలు

ప్రముఖ కంపెనీ Nokia మరొక దిగ్గజ సంస్థ Apple తో కొత్త పేటెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ ని చేసుకున్నట్లు ప్రకటించింది. 2017 మే నెలలో ఇరు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం 2023 చివరికల్లా పూర్తవుతుంది. ఈ తరుణంలో నోకియా మరియు ఆపిల్ సంస్థలు తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేశాయి.

ఈ కొత్త పేటెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది 5జీ లో నోకియా చేసిన ఆవిష్కరణలు మరియు ఇతర టెక్నాలజీలకు వర్తిస్తుంది. ఇరు కంపెనీలు కుదుర్చుకున్న అగ్రిమెంట్ తాలూకు నియమ నిబంధనలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. కానీ, తాము మల్టీ-ఇయర్ పీరియడ్ కి గాను ఆపిల్ నుంచి పేమెంట్స్ పొందుతామని తెలిపింది. 2024 జనవరి నుంచి తాము ఆశించిన రెవెన్యూ జనరేట్ అవుతుందని భావిస్తున్నట్లు నోకియా తెలిపింది.

ఏప్రిల్ 20, 2023న వెల్లడించిన ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో ఆపిల్‌తో కొత్త ఒప్పందం దాని దీర్ఘకాలిక దృక్పథానికి అనుగుణంగా ఉందని ఫిన్నిష్ కంపెనీ తెలిపింది.

ఈ ఒప్పందంపై నోకియా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ జెన్నీ లుకాండర్ వ్యాఖ్యానిస్తూ, “యాపిల్‌తో స్నేహపూర్వక ప్రాతిపదికన దీర్ఘకాలిక పేటెంట్ లైసెన్స్ ఒప్పందాన్ని ముగించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం Nokia యొక్క పేటెంట్ పోర్ట్‌ఫోలియో యొక్క బలం, R&Dలో దశాబ్దాల తరబడి పెట్టుబడులు మరియు సెల్యులార్ ప్రమాణాలు మరియు ఇతర సాంకేతికతలకు అందించిన సహకారాన్ని ప్రతిబింబిస్తుంది.

Nokia యొక్క పేటెంట్ పోర్ట్‌ఫోలియో 2000 నుండి R&Dలో €140 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టబడింది మరియు 5Gకి అవసరమైన 5,500 కంటే ఎక్కువ పేటెంట్ కుటుంబాలతో సహా దాదాపు 20,000 పేటెంట్ కుటుంబాలను కలిగి ఉంది.

The post కొత్త పేటెంట్ క్రాస్-లైసెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన Nokia, Apple సంస్థలు first appeared on 91Mobiles Telugu.

]]>
60 ఏళ్ళలో తొలిసారిగా మారిన Nokia లోగో https://www.91mobiles.com/telugu/nokia-logo-changed-for-the-first-time-in-60-years/ Mon, 27 Feb 2023 14:50:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=5123 Nokia.. 60 ఏళ్ళ తన ప్రస్థానంలో తొలిసారిగా తన బ్రాండ్ లోగోని మార్చింది. ఈసారి పాత లోగో స్థానంలో పూర్తిగా కొత్త లోగోని తీసుకొచ్చింది. కొత్త లోగో లో 5 విభిన్న ఆకారాలు కలగలిసి Nokia అనే పదానికి రూపం ఇచ్చాయి. ఐకానిక్ బ్లూ కలర్ స్థానంలో వివిధ రంగులు ప్రవేశించాయి. Reuters తో జరిగిన ఇంటర్వ్యూలో నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లుండ్‌మార్క్ మాట్లాడుతూ, “ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ తో అసోసియేషన్ ఉండేది. ఈరోజుల్లో మేం […]

The post 60 ఏళ్ళలో తొలిసారిగా మారిన Nokia లోగో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తన 60 ఏళ్ళ ప్రస్థానంలో తొలిసారిగా లోగోని మార్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia
  • 5 విభిన్న ఆకారాలతో రూపొందిన Nokia యొక్క కొత్త లోగో
  • అవసరానుగుణంగా ఇతర రంగుల్లోకి మారిన ఐకానిక్ బ్లూ కలర్

Nokia.. 60 ఏళ్ళ తన ప్రస్థానంలో తొలిసారిగా తన బ్రాండ్ లోగోని మార్చింది. ఈసారి పాత లోగో స్థానంలో పూర్తిగా కొత్త లోగోని తీసుకొచ్చింది. కొత్త లోగో లో 5 విభిన్న ఆకారాలు కలగలిసి Nokia అనే పదానికి రూపం ఇచ్చాయి. ఐకానిక్ బ్లూ కలర్ స్థానంలో వివిధ రంగులు ప్రవేశించాయి.

Reuters తో జరిగిన ఇంటర్వ్యూలో నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లుండ్‌మార్క్ మాట్లాడుతూ, “ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ తో అసోసియేషన్ ఉండేది. ఈరోజుల్లో మేం బిజినెస్ టెక్నాలజీగా మారం.” అని అన్నారు. 2020 లో ఫిన్నిష్ కంపెనీ నోకియా సీఈవో గా బాధ్యతలు తీసుకున్నాక, లుండ్‌మార్క్ తన స్ట్రేటజీని అమలు చేస్తూ వస్తున్నారు. రిసెట్, యాక్సలరేట్, స్కేల్ అనే ఫార్ములాతో ఆయన ముందుకు వెళ్తున్నారు.

కంపెనీ ప్రకారం, రిసెట్ దశ ప్రస్తుతం ముగిసింది. ప్రస్తుతం రెండవ దశ ప్రారంభమైందని లుండ్‌మార్క్ చెప్పారు. Nokia సంస్థ తన సర్వీస్ ప్రొవైడర్ బిజినెస్ ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. టెలీకామ్ కంపెనీలకు నోకియా సాంకేతికతను, ఎక్విప్మెంట్ ని అమ్ముతుంది. ఇది నోకియా యొక్క ప్రధాన బిజినెస్.

మారిన Nokia లోగో

టెక్నాలజీ సంస్థలు టెలీకామ్ ఎక్విప్మెంట్ అమ్మే నోకియా వంటి సంస్థలతో జట్టుకట్టి ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్, ఇతర సామగ్రిని ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలకు అమ్ముతున్నాయి. ప్రస్తుతం నోకియా సంస్థ తనకు చెందిన వివిధ వ్యాపారాల వృద్ధి సరళిని సమీక్షించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై తన దృష్టిని నిలిపింది.

“మమ్మల్ని అగ్రస్థానంలో నిలిపే బిజినెసెస్ లోనే ఉండాలని మేం భావిస్తున్నాం. అందుకు ప్రస్తుత పరిణామమే ఒక కచ్చితమైన సూచన.” అని లుండ్‌మార్క్ అన్నారు. ఆటోమేషన్ మరియు డేటా సెంటర్స్ వ్యాపారాల్లో మైక్రోసాఫ్ట్ మరియు అమెజాన్ లకు గట్టి పోటీ ఇవ్వాలని Nokia భావిస్తోంది.

తక్కువ మార్జిన్స్ ఉన్న భారతీయ మార్కెట్ తమకు వేగంగా వృద్ధి చెందే చోటు అని, ఇదొక నిర్మాణాత్మక మార్పు అని లుండ్‌మార్క్ అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉత్తర అమెరికా బలంగా తయారయ్యే అవకాశం ఉందని Nokia భావిస్తోంది.

ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే, తాజాగా Nokia సంస్థ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న MWC 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది. ఇది కూడా చదవండి: MWC 2023: 90Hz డిస్ప్లే, 50MP కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 60 ఏళ్ళలో తొలిసారిగా మారిన Nokia లోగో first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/nokia-files-case-on-oppo-4g-5g-technology-scandal/ Mon, 17 Oct 2022 07:27:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2916 హైలైట్స్ ఒప్పో ని కోర్టుకి లాగనున్న నోకియా, ఆస్ట్రేలియాలో కేసు నమోదు గడువు ముగిసినా రెనివల్ చేయకుండా తమ టెక్నాలజీని వినియోగించుకుంటోందని నోకియా ఆరోపణలు అనుమతి లేకుండా నోకియా యొక్క 4జీ, 5జీ టెక్నాలజీని ఒప్పో వాడుకుంటోందని నోకియా వాదన పోటీలో ముందుండాలనే తపన ప్రతి రంగంలో ఉంటుంది. టెక్నాలజీ మార్కెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ తమ యూజర్ బేస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ […]

The post OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఒప్పో ని కోర్టుకి లాగనున్న నోకియా, ఆస్ట్రేలియాలో కేసు నమోదు
  • గడువు ముగిసినా రెనివల్ చేయకుండా తమ టెక్నాలజీని వినియోగించుకుంటోందని నోకియా ఆరోపణలు
  • అనుమతి లేకుండా నోకియా యొక్క 4జీ, 5జీ టెక్నాలజీని ఒప్పో వాడుకుంటోందని నోకియా వాదన

పోటీలో ముందుండాలనే తపన ప్రతి రంగంలో ఉంటుంది. టెక్నాలజీ మార్కెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ తమ యూజర్ బేస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ పోరులో, కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి. ఇటువంటి స్కాండల్ లోనే చైనా కంపెనీ ఒప్పో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ బ్రాండ్ నోకియా, ఒప్పో ఆస్ట్రేలియా పై కేసు పెట్టింది. దీని కంటే ముందు నోకియా కంపెనీ వన్‌ప్లస్, ఒప్పో లను జర్మనీ లో ఓ కేసులో ఓడించింది. దీని తర్వాత ఆ దేశంలో ఒప్పో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిలిచిపోయాయి.

OPPO పై కేసు పెట్టనున్న Nokia

నోకియా కంపెనీ, చైనీస్ బ్రాండ్ ఒప్పో పై కేసు ఫైల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసే ఆస్ట్రేలియాలో నమోదు కానుంది. ఈ కేసు నోకియా యొక్క సర్వీస్ ఎనేబుల్మెంట్ ప్లాట్ఫమ్ అతిక్రమణకు సంబంధించినది. నోకియా 4జీ మరియు 5జీ టెక్నాలజీలను కంపెనీ అనుమతి లేకుండా ఒప్పో సంస్థ వినియోగిస్తోందని సదరు కంపెనీ ఆరోపిస్తోంది. ఒప్పో ప్రస్తుతం నోకియా యొక్క టెక్నాలజీని తన స్మార్ట్ ఫోన్లలో వాడుతోంది. అయితే అనుమతి లేకుండా వాడుతోంది.

OPPO పై Nokia ఎందుకు కేసు పెట్టింది?

2018 లో వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫిన్‌ల్యాండ్ కి చెందిన నోకియా మరియు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కి మధ్య ఒక లైసెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, నోకియా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఒప్పో తన ప్రోడక్ట్స్ లో వాడుకునే అవకాశం ఉంది. అయితే ఆ లైసెన్స్ గడువు 2021 తో ముగిసింది. కానీ, ఒప్పందాన్ని రిన్యూ చేసుకోకుండా ఒప్పో సంస్థ నోకియా టెక్నాలజీని వాడుకుంటోంది. దీంతో నోకియా కంపెనీ ఒప్పో పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జర్మనీలో బ్యాన్ అయిన OPPO స్మార్ట్ ఫోన్లు

ఆస్ట్రేలియా కంటే ముందు, నోకియా కంపెనీ ఒప్పో, వన్‌ప్లస్ పైన జర్మనీ లో కేసు పెట్టింది. అప్పుడు కోర్టు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలది తప్పని తేల్చడంతో, నోకియా ఆ కేసులో గెలిచింది. దాంతో జర్మనీలో ఒప్పో మరియు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు రద్దయ్యాయి. ఈ బ్యాన్ తో ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలకు పెద్ద దెబ్బ తగిలినట్లైంది. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో కూడా ఒప్పో మొబైల్ ఫోన్లు బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఒప్పో, నోకియా సంస్థలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OPPO ని కోర్టుకి లాగనున్న Nokia కంపెనీ, ఒప్పో ఫోన్లు రద్దయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన Nokia X30 5G, Nokia G60 5G, Nokia C31, Nokia T21: ధరలు, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/nokia-x30-nokia-g60-nokia-c31-nokia-t21-price-specs/ Thu, 01 Sep 2022 14:17:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2050 హైలైట్స్: స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, బ్లూటూత్ స్పీకర్స్ ని ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో లాంచ్ చేసిన నోకియా నోకియా ఎక్స్30 5జీ, నోకియా జీ60 5జీ, నోకియా సీ31, నోకియా టీ1 లను లాంచ్ చేసిన నోకియా భారత్ లో డివైజెస్ లభ్యతపై ఇంకా రాని క్లారిటీ నోకియా బ్రాండ్ హక్కుదారు HMD Global, గురువారం నాడు జరిగిన ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో పలు నోకియా డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈవెంట్లో నోకియా […]

The post లాంచ్ అయిన Nokia X30 5G, Nokia G60 5G, Nokia C31, Nokia T21: ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, బ్లూటూత్ స్పీకర్స్ ని ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో లాంచ్ చేసిన నోకియా
  • నోకియా ఎక్స్30 5జీ, నోకియా జీ60 5జీ, నోకియా సీ31, నోకియా టీ1 లను లాంచ్ చేసిన నోకియా
  • భారత్ లో డివైజెస్ లభ్యతపై ఇంకా రాని క్లారిటీ

నోకియా బ్రాండ్ హక్కుదారు HMD Global, గురువారం నాడు జరిగిన ఐఎఫ్ఏ 2022 ఈవెంట్ లో పలు నోకియా డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈవెంట్లో నోకియా టీ21 టాబ్లెట్, నోకియా పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ 2, క్లారిటీ ఇయర్‌బడ్స్ 2 ప్రో, మూడు స్మార్ట్ ఫోన్స్: నోకియా ఎక్స్30 5జీ, నోకియా జీ60 5జీ, నోకియా సీ31 లను లాంచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన మార్కెట్లలో ఈ డివైజ్ లను నోకియా లాంచ్ చేసింది. ఈ డివైజెస్ ని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా లో లాంచ్ చేస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. మరి ఈ డివైజెస్ యొక్క ఫీచర్లేంటో తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G: ధర, ఫీచర్లు

నోకియా ఎక్స్30 5జీ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్ సపోర్ట్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా: 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా, మూడేళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని నోకియా ప్రామిస్ చేస్తోంది.

ఈ ఫోన్ క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర 529 యూరోలు (దాదాపు రూ.42,200)

Nokia G60 5G: ధర, ఫీచర్లు

నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4జిబి/64జిబి, 4జిబి/128జిబి, 6జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక నోకియా నుంచి 3 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి.

ప్యూర్ బ్లాక్, ఐస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర 319 యూరోలు (రూ.25,500)

Nokia C31: ధర, ఫీచర్లు

నోకియా సీ31 లో 6.7 అంగుళాల 2.5డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి/128జిబి స్టోరేజీ, 256జిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్), 5050ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, యూనిసాక్ 9863ఏ1 చిప్, 13ఎంపి+2ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో ఉన్నాయి.

మింట్, చార్కోల్, సైఆన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. కాగా, ఈ ఫోన్ ధర 239 యూరోలు (దాదాపు రూ.19,000)

Nokia T21 టాబ్లెట్: ధర, ఫీచర్లు

నోకియా టీ21 టాబ్లెట్ లో 10.4 అంగుళాల 2కే డిస్ప్లే, 360 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ టీ612 చిప్, 8200ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ చార్జింగ్, 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 512 ఎక్స్‌పాండబుల్ మెమొరీ (వయా ఎస్డీ కార్డ్), 8ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్ లో ఈ ట్యాబ్లెట్ లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్ ధర 129 యూరోలు (దాదాపు రూ.10,300)

The post లాంచ్ అయిన Nokia X30 5G, Nokia G60 5G, Nokia C31, Nokia T21: ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన కొత్త Nokia ఫోన్.. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ https://www.91mobiles.com/telugu/nokia-launched-nokia-8210-4g-feature-phone-india/ Wed, 03 Aug 2022 07:47:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=1449 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన Nokia 8210 4G ఫీచర్ ఫోన్ 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్ నోకియా కంపెనీ భారత్ లో Nokia 8210 4G ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. దృఢమైన బాడీ, ఎక్కువ […]

The post భారత్ లో లాంచ్ అయిన కొత్త Nokia ఫోన్.. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Nokia 8210 4G ఫీచర్ ఫోన్
  • 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత
  • 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్

నోకియా కంపెనీ భారత్ లో Nokia 8210 4G ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. దృఢమైన బాడీ, ఎక్కువ రోజులు నడిచే బ్యాటరీ తో వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్. ఇప్పటి వరకు జనాలు ఈ ఫోన్ ని మరచిపోలేదు. ఆ ఓల్డ్ మోడల్ ని గుర్తు తెస్తూ, లేటెస్ట్ గా ఈ ఫోన్ ని లాంచ్ చేసారు. పాత మోడల్ లో 2జీ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, లేటెస్ట్ మోడల్ లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఇక ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను గురించి చూస్తే, ఫోన్ లో యూనిసాక్ టీ107 చిప్సెట్ ను అమర్చారు. 48ఎంబి ర్యామ్ ఉంటుంది. దీంతో పాటు, ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

Nokia 8210 4G ధర

అమెజాన్ ఇండియా తో కలిసి నోకియా కంపెనీ నోకియా 8210 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని మీరు రూ.3,999 కి కొనుగోలు చేయవచ్చు. డార్క్ బ్లూ, రెడ్ షేడ్స్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ కాకుండా, నోకియా స్టోర్ నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై కంపెనీ, ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారంటీని ఇస్తోంది.

Nokia 8210 4G స్పెసిఫికేషన్స్

  • 4జీ కనెక్టివిటీ
  • ఎఫ్ఎమ్ రేడియో
  • 3.5 ఎంఎం ఆడియో జాక్
  • బ్లూటూత్ 5.0
  • మ్యూజిక్ ప్లేయర్
  • వీజీఏ కెమెరా

నోకియా 8210 4జీ ఫోన్లో 3.8 అంగుళాల డిస్ప్లే ను అందించారు. కలర్ఫుల్ క్యూవీజీఏ డిస్ప్లేను కంపెనీ ఉపయోగించింది. యూనిసాక్ టీ107 చిప్సెట్ పై ఫోన్ పని చేస్తుంది. అలాగే మీకు 128ఎంబి స్టోరేజీ, 48ఎంబి ర్యామ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశముంది.

ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో 30+ ఓఎస్ ను అందించారు. వీజీఏ రెజుల్యూషన్ కలిగిన 0.3 ఎంపి కెమెరాను ఈ ఫోన్లో అందించారు. ఎఫ్ఎం రేడియో, మ్యూజిక్ ప్లేయర్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఎఫ్ఎమ్ రేడియో వైర్ తో, వైర్ లేకుండా కూడా పని చేస్తుంది.

మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియా జాక్ ఈ ఫోన్లో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వర్షన్ 5 ని అందించారు. ఇప్పుడు బ్యాటరీ వివరాలను తెలుసుకుందాం. ఈ ఫోన్లో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 27 రోజుల స్టాండ్ బై ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్ బరువు కేవలం 107 గ్రాములు.

రబ్బర్ ఫినిషింగ్ తో ఉన్న ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్ ని ఈ ఫోన్లో అందించారు. కీప్యాడ్ ఫోన్ కోసం చూసేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

The post భారత్ లో లాంచ్ అయిన కొత్త Nokia ఫోన్.. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ first appeared on 91Mobiles Telugu.

]]>