2024 ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు

2024 జనవరిలో చాలా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. అలాగే రాబోవు ఫిబ్రవరి నెలలో కూడా ఎన్నో ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. iQOO Neo 9 Pro, Honor X9b, Nothing Phone (2a), Oppo F25 5G తదితర ఫోన్లు 2024 ఫిబ్రవరిలో లాంచ్ అవ్వనున్నాయి. జనవరి 2024 గురించి మాట్లాడితే, ఈ నెలలో OnePlus 12, Galaxy S24 సిరీస్, Redmi Note 13 సిరీస్ తదితర డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. 2024 ఫిబ్రవరి నెలలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను మేం సిద్ధం చేశాం. ఓసారి చదివేయండి.

iQOO Neo 9 Pro (ఇండియా లాంచ్)

లాంచ్ తేదీ: ఫిబ్రవరి 22, 2024

iQOO Neo 9 Pro భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 22న లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, హెచ్డీఆర్10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఓఐఎస్ ఫీచర్, 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

Honor X9b (ఇండియా లాంచ్)

లాంచ్ తేదీ: ఫిబ్రవరి 15, 2024 (ఇండియా)

Honor X9b డివైజ్ ఫిబ్రవరి 15న భారత్ లో లాంచ్ అవుతోంది. Honor X9b లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 6.78-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Nothing Phone (2a) (గ్లోబల్ లాంచ్)

లాంచ్ తేదీ: ఫిబ్రవరి 27, 2024 (గ్లోబల్ లాంచ్ అంచనా)

Nothing Phone (2a) ఫోన్ ఫిబ్రవరిలో జరగబోవు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో లాంచ్ కానుంది. లీకైన సమాచారం ప్రకారం, Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.

OPPO F25 5G (ఇండియా లాంచ్)

లాంచ్ తేదీ: ఫిబ్రవరి 2024 (అంచనా)

OPPO F25 5G డివైజ్ ఫిబ్రవరి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. లీకైన సమాచారం ప్రకారం, OPPO F25 5G డివైజ్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒమ్నివిజన్ ఒవి64బి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.

Lava Blaze Curve 5G (ఇండియా లాంచ్)

లాంచ్ తేదీ: ఫిబ్రవరి 2024 (అంచనా)

Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి నెలలో లాంచ్ కానుంది. కచ్చితమైన తేదీన కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లీకైన సమాచారం ప్రకారం, Lava Blaze Curve 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.