Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

Highlights

  • ఏప్రిల్‌లో లాంచ్ కానున్న పలు స్మార్ట్‌ఫోన్లు
  • లైనప్ లో మోటోరోలా, రియల్మీ, శాంసంగ్
  • ఇంకా రెడ్మీ, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల ఫోన్లు

ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

  • OnePlus Nord CE 4 5G
  • Realme 12x 5G
  • Motorola Edge 50 Pro
  • Samsung Galaxy M55 5G
  • Samsung Galaxy M15 5G
  • Infinix Note 40 Pro 5G
  • Infinix Note 40 Pro+ 5G

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.24,999 గా ఉంటుందని తెలుస్తోంది. స్సెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 4 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

Realme 12x 5G

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా వస్తోన్న Motorola Edge 50 Pro ధర రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం.

Samsung Galaxy M55 5G

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.26,999 ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండవచ్చు.

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ వారంలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G సిరీస్

Infinix Note 40 Pro 5G సిరీస్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ తేదీన అధికారికంగా వెల్లడవుతుంది. Infinix Note 40 Pro 5G సిరీస్ లో Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నాయి. ప్రో మోడల్ 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ప్రో ప్లస్ వేరియంట్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనున్నాయి. ఈ ఫోన్లు 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఇంకా Infinix Note 40 Pro 5G సిరీస్ 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.