Galaxy Unpacked: వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్

Highlights

  • జులైలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • లాంచ్ కానున్న ఫోల్డబుల్ ఫోన్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Z Fold 6, Flip 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన Galaxy Unpacked ఈవెంట్‌ని వచ్చే నెలలో నిర్వహించనుంది. ఈవెంట్ లో పలు ఉత్పత్తులను శాంసంగ్ లాంచ్ చేయనుంది. లాంచ్ అయ్యే వాటిలో Galaxy Z Fold 6, Galaxy Z Flip 6, Galaxy Ring, Galaxy Watch Ultra, Galaxy Watch 7 సిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈవెంట్ లో Galaxy AI కూడా ఆకర్షణగా నిలవనుంది. కొత్త ఏఐ ఫీచర్లను శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టనుందని సమాచారం.

Samsung Galaxy Unpacked ఈవెంట్ వివరాలు

Samsung Galaxy Unpacked ఈవెంట్ జులై 10వ తేదీన ప్యారిస్ నగరంలో జరుగుతుంది. ఈవెంట్ లో గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. Galaxy Z Fold 6, Z Flip 6 డివైజెస్ జులై 10న లాంచ్ కానున్నాయని కంపెనీ వెల్లడించింది.

Samsung Galaxy Unpacked ఈవెంట్‌ ప్రత్యక్షప్రసారాన్ని చూడాలనుకునే వారు జులై 10 సాయంత్రం 6.30 గంటలకు శాంసంగ్.కామ్, శాంసంగ్ న్యూస్‌రూమ్ మరియు శాంసంగ్ యొక్క యూట్యూబ్ చానల్ ద్వారా చూడవచ్చు.

Samsung Galaxy Z Flip 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy Z Flip 6 డివైజ్ భారీ కవర్ డిస్ప్లే, ఇన్నర్ స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. కవర్ స్క్రీన్ సైజ్ 3.9-ఇంచెస్ గా ఉంటుందని అంచనా.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 6 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి/256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Z Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy Z Flip 6 లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: Samsung Galaxy Z Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని కూడా అందించనున్నారు.