NBTC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy S24 Ultra

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న S24, S24 Plus, S24 Ultra
  • థాయిలాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన S24 Ultra

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ రానున్నాయి. ఇటీవలె Samsung Galaxy S24 Ultra డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ కనిపించింది. సరే, ఓసారి ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎంలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 Ultra ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

  • Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ B38606-23 మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా Samsung Galaxy S24 Ultra కి సంబంధించి మోడల్ నంబర్ తప్పితే మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
  • ఇప్పటికే పలు లీక్స్ ద్వారా తెలిసిన Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.7-ఇంచ్ డబ్ల్యూక్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 5x జూమ్ కెమెరా, 10ఎంపి 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.