iPhone లాంటి డిజైన్‌తో రానున్న Samsung Galaxy S24, S24 Plus

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24, S24 Plus
  • ఫ్లాట్ సైడ్స్ తో రానున్న Samsung Galaxy S24, S24 Plus
  • వేర్వేరు చిప్సెట్స్ తో రానున్న రెండు డివైజెస్

Samsung Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 లను దక్షిణ కొరియాలోని సియోల్‌లో గత నెలలో Samsung కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పుడు తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ కోసం పలు కీలకమైన మార్పులతో శాంసంగ్ సంస్థ వచ్చే ఏడాది జరగబోవు Galaxy Unpacked ఈవెంట్ కోసం సిద్ధమవుతోంది. ఈసారి రాబోవు శాంసంగ్ ఫ్లాగ్షిప్ శ్రేణి కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకో తెలుసుకుందాం పదండి.

సామ్‌సంగ్ లీక్‌ల విషయానికి వస్తే ఎంతో కచ్చితమైన సమాచారం అందివ్వడంలో టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా Galaxy S24 మరియు Galaxy S24 Plus ఐఫోన్‌ల మాదిరిగానే పూర్తిగా ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉంటాయని తాజాగా తన ట్వీట్‌లో సదరు టిప్‌స్టర్ తెలిపింది.  ఒకసారి గమనిస్తే, Galaxy S23 మరియు Galaxy S23 ప్లస్‌లు కూడా ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉన్నాయి. కానీ, అవి అంత గుర్తించదగిన విధంగా లేవు.

అయితే, ఈసారి, ఫ్రేమ్ iPhone 12 సిరీస్ నుండి iPhoneలు ఎలాంటి డిజైన్ తో వస్తున్నాయో అదే విధంగా రాబోయే గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు ఉంటాయని తెలుస్తోంది. కర్వ్డ్ డిస్ప్లేస్ నుంచి మెల్లగా తప్పుకుంటోన్న శాంసంగ్ ఫ్లాట్ స్క్రీన్స్ తో తన రాబోవు ఫ్లాగ్షిప్ ఫోన్లను తీసుకొస్తుందని భావిస్తున్నారు. కెమెరా డిజైన్ Galaxy S23 మాదిరిగానే ఉండవచ్చని మరియు డివైజ్ చైనాలో లాంచైన Meizu 20 లాగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

Samsung Galaxy S24 Ultra: తాజా సమాచారం

గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy S24 Ultra టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. iPhone 15 Pro, iPhone 15 Pro Max లలో టైటానియమ్ ఫ్రేమ్ వాడనున్నారని రూమర్లు రావడంతో, శాంసంగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. టైటానియమ్ ఫ్రేమ్ వల్లన ఫోన్ బరువు గణనీయంగా తగ్గనుంది. అంతేకాదు, మరింత దృఢత్వం కూడా లభిస్తుంది. లైట్ వెయిట్ మరియు స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీని కోరుకునే వారికి ఈ టైటానియమ్ ఫ్రేమ్ కలిగిన డివైజెస్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

Samsung Galaxy S24 సిరీస్‌ను విక్రయించే ప్రాంతం ఆధారంగా రెండు ప్రాసెసర్ ఆప్షన్స్ ని శాంసంగ్ అందిస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఆప్షన్ తో రానుండగా, మరికొన్ని మార్కెట్స్ లో శాంసంగ్ అభివృద్ధి చేసిన సొంత చిప్సెట్ Exynos 2400 ఉంటుంది. ఈ డివైజెస్ యొక్క US వేరియంట్‌లు ఇటీవల గీక్‌బెంచ్‌లో కూడా గుర్తించబడ్డాయి. గెలాక్సీ S24 ప్లస్ స్క్రీన్ పరిమాణం 6.65-అంగుళాలకు పెరగడంతో సిరీస్‌లోని మూడు ఫోన్లకు కొత్త కెమెరా సిస్టమ్‌లు మరియు డిస్‌ప్లేలు అందించబడతాయని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.