Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Exynos 2400 చిప్‌తో వచ్చిన S24, S24 Plus

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus ఫోన్ల యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24, Galaxy S24 Plus ధరలు

  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 డివైజ్ అంబర్ యెల్లో, కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.109,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Plus డివైజ్ కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24, Galaxy S24 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ స్క్రీన్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Samsung Galaxy S24 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus లో ఎగ్జినోస్ 2400 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Samsung Galaxy S24 Plus డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Samsung Galaxy S24 Plus లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ పవర్‌షేర్ ఫీచర్ కూడా ఈ ఫోన్లలో ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus డివైజెస్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 3.2 జెన్ 1, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, యూడబ్ల్యూబి వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Samsung Galaxy S24 లో యూడబ్ల్యూబి ఫీచర్ లేదు.