Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Galaxy M35, F35

Highlights

  • త్వరలో భారత్‌లో Galaxy M35, F35 లాంచ్
  • BIS పై లిస్టైన డివైజెస్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ మరియు ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Galaxy M35, Galaxy F35 పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు డివైజెస్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్35 మరియు గెలాక్సీ ఎఫ్35 ఫోన్ల యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Galaxy M35, F35 ఇండియా లాంచ్

Galaxy M35, F35 డివైజెస్ తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యాయి. ఎమ్35 ఫోన్ SM-M356B/DS అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. మరోవైపు, ఎఫ్35 ఫోన్ SM-E356B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న DS అక్షరాలు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ని సూచిస్తున్నాయి. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు. కొన్ని రోజుల క్రితం M35 ఫోన్ గీక్‌బెంచ్ పై Exynos 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ, 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

ఇటీవలె లాంచైన Galaxy A35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడింది. ఎమ్-సిరీస్ లో రాబోయే డివైజ్ కూడా ఏ35 మాదిరి స్పెసిఫికేషన్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఓసారి శాంసంగ్ ఏ35 5జీ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.