Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ మామూలుగా లేవుగా!

Highlights

  • జులై 17న Samsung Galaxy M35 5G లాంచ్
  • అమెజాన్ ద్వారా సేల్
  • గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని శాంసంగ్ ఇండియా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ జులై 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని X మరియు అమెజాన్ ద్వారా శాంసంగ్ వెల్లడించింది.

జులై 20 నుంచి 21 మధ్య జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ డివైజ్ పై ఆఫర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Samsung Galaxy M35 5G డివైజ్ లో వేపర్ కూలింగ్ చాంబర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

మెమొరీ: Samsung Galaxy M35 5G డివైజ్ బ్రెజిల్ లో 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్‌ని గరిష్టంగా 16జిబి వరకు పెంచుకోవచ్చు. 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy M35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్, నాక్స్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి.