లీకైన Samsung Galaxy M34 5G భారతీయ మార్కెట్ ధర

Highlights

  • జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G
  • అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న డివైజ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న హ్యాండ్సెట్

శాంసంగ్ సంస్థ తన కొత్త గెలాక్సీ ఎం-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Galaxy M34 5Gని భారతదేశంలో తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy M34 5G జూలై 7న లాంచ్ అవుతోంది. Samsung ఇప్పటికే ఫోన్‌కి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసింది. అలాగే Galaxy M34 5G డిజైన్‌ను రివీల్ చేసింది. ఇంతలోగా, కొత్త లీక్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ తో సహా గెలాక్సీ M34 5G ధర కూడా రివీల్ అయ్యింది.

Galaxy M34 5G యొక్క బేస్ మోడల్ ధర రూ. 20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ పేర్కొన్నారు. అయితే మరొక ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ధర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లీకైన Samsung Galaxy M34 5G ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు మరియు ఇప్పటివరకు తెలిసిన ఇతర వివరాలను చూద్దాం.

భారత్ లో Samsung Galaxy M34 5G ధర (లీక్)

Samsung Galaxy M34 5G డివైజ్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ కస్టమర్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తోన్న డివైజ్. ఇది జూలై 7న లాంచ్ కానుందని ఖరారైంది. Galaxy M34 5G భారతదేశంలో రూ. 18,000 లేదా రూ. 19,000 ప్రారంభ ధరతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ బ్రార్ పేర్కొన్నారు. పరికరం 8GB RAM మరియు 128GB స్టోరేజీతో లాంచ్ అవుతుందని బ్రార్ తెలిపారు.

మరోవైపు, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్, సామ్‌సంగ్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో ఫోన్‌ను లాంచ్ చేస్తుందని అంటున్నారు. బేస్ మోడల్ 6GB RAMని అందిస్తుంది. దీని ధర సుమారు రూ.21,000. ఈ ఫోన్ యొక్క 8GB RAM వేరియంట్ ధర దాదాపు రూ.24,000గా ఉంటుందని సమాచారం.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy M34 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్: Samsung Galaxy M34 5G లో 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
  • స్టోరేజీ: Samsung Galaxy M34 5G డివైజ్ 128జిబి స్టోరేజీ ఆప్షన్, మైక్రోఎస్డీ కార్డ్ ఫీచర్ తో వస్తుందని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ చెబుతున్నారు.
  • కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.
  • ఓఎస్: Samsung Galaxy M34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.