Samsung Galaxy M34 5G పై రూ.4,000 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • మరింత చవకగా Samsung Galaxy M34 5G
  • డివైజ్ ధరను రూ.4,000 తగ్గించిన కంపెనీ
  • ప్రస్తుతం Galaxy M34 5G ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G ధరను తగ్గించింది. 5జీ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం కానుంది. ప్రస్తుతం తక్కువ ధరలో గెలాక్సీ ఎమ్34 5జీ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Samsung Galaxy M34 5G ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G ధర

Samsung Galaxy M34 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.16,999 కాగా, రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.12,999 కే లభిస్తోంది.

Samsung Galaxy M34 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.18,999 కాగా, రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.14,999 కే లభిస్తోంది.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వాటర్‌ఫాల్ బ్లూ, సిల్వర్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G లో ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ కి నాలుగేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామినిస్తోంది.

కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.