6.5-ఇంచ్ AMOLED డిస్ప్లే, Exynos 1280 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy M34 5G

Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy M34 5G
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Samsung Galaxy M34 5G ప్రారంభ ధర రూ.17,999

శాంసంగ్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, కెమెరా విభాగాల్లో అప్‌గ్రేడ్ అయ్యింది. Samsung Galaxy M34 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్-డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. శాంసంగ్ సొంత చిప్సెట్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ని ఈ ఫోన్ లో కల్పించారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy M34 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy M34 5G ధర, లభ్యత

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా నిర్ణయించారు. ప్రిస్మ్ సిల్వర్, మిడ్నైట్ బ్లూ, వాటర్‌ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Samsung Galaxy M34 5G ప్రీ-బుకింగ్స్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ నేడు అనగా జులై 7 నుంచి మొదలవుతాయి. జులై 15 న ప్రైమ్ డే సందర్భంగా Samsung Galaxy M34 5G సేల్ ప్రారంభం కానుంది. Samsung Galaxy M34 5G డివైజ్ 6జిబి ర్యామ్ వేరియంట్ ని ఇంట్రడక్టరీ ధర రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు 8జిబి ర్యామ్ వేరియంట్ ని రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ కి నాలుగేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని కంపెనీ హామినిస్తోంది.
  • చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G లో ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.