జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G

Highlights

  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Samsung Galaxy M34 5G
  • జులై 7 న అనౌన్స్ కానున్న ఆఫర్లు, ధర వివరాలు
  • ఓఐఎస్, నో షేక్ మోడ్ తో వస్తోన్న Samsung Galaxy M34 5G

శాంసంగ్ సంస్థ భారత్ లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ని పెంచుకుంటూ పోతోంది. జులై 7 న భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M34 5G ని లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy M34 5G లాంచ్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో జులై 7 న లాంచ్ అవుతోంది. అమెజాన్ వెబ్ సైట్ లో ఉన్న ఈ డివైజ్ ప్రొడక్ట్ పేజీ ద్వారా ఎన్నో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర, సేల్, ఆఫర్ వివరాలు జులై 7 న మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రానున్నాయి. Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ అమ్మకాలు అమెజాన్ ద్వారా జరగనున్నాయి.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.46-ఇంచ్ భారీ వాటర్ డ్రాప్ నాచ్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 2 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ గురించి ఇంకా సమాచారం బయటకు రాలేదు.

Samsung Galaxy M34 5G లీకైన వివరాలు

పైన పేర్కొనబడిన Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని లీక్స్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.