ఖరారైన Samsung Galaxy M34 5G ఇండియా లాంచ్; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M34 5G
  • డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్
  • అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్న Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. Samsung Galaxy M33 కి సక్సెసర్ గా Samsung Galaxy M34 5G డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ సపోర్ట్ పేజీ శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో లాంచ్ సమీపిస్తుందని తెలిసింది. అధికార ప్రకటన కోసం వేచి చూస్తోన్న తరుణంలో, ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.

అమెజాన్ పై మైక్రోసైట్ ద్వారా Samsung Galaxy M34 5G డివైజ్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. టీజర్ వీడియో లో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉందని తెలుస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో ఈ ఫోన్ వస్తోంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M34 వాటర్‌డ్రాప్ నాచ్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
  • ప్రాసెసర్: ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
  • ర్యామ్ మరియు స్టోరేజ్: టిప్‌స్టర్ RAM మరియు స్టోరేజ్ వివరాలను షేర్ చేయనప్పటికీ, ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నట్లు సమాచారం.
  • OS: Samsung Galaxy M34 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరాలు: Samsung Galaxy M34 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ లెన్స్ మరియు 5MP థర్డ్ సెన్సార్‌ ఉంటాయి.. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 13MP షూటర్ ఉంటుంది.
  • బ్యాటరీ: ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ చెప్పారు.
  • డైమెన్షన్స్: Samsung Galaxy M34 8.2mm మందం మరియు 199 గ్రాముల బరువు ఉంటుంది.