Samsung Galaxy M34 5G పై రూ.6,000 డిస్కౌంట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా లభిస్తోన్న ఆఫర్

Highlights

  • Samsung Galaxy M34 5G ధర తగ్గింపు
  • ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఆఫర్
  • ఎగ్జినోస్ 1280 5ఎన్ఎమ్ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G పై ఆఫర్ ప్రకటించింది. జూన్ మొదటి వారంలో ఈ ఫోన్ ధరను రూ.4,000 తగ్గించగా, ఇప్పుడు రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్ దీనికి జతచేరింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది.

మీరు గనుక, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల ఫోన్ కొనాలని భావిస్తుంటే Samsung Galaxy M34 5G మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G ధర, ఆఫర్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ పై రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్‌ను శాంసంగ్ ప్రకటించింది. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ధర తగ్గింపు తర్వాత Samsung Galaxy M34 5G బేస్ మోడల్‌ను రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు. మిడ్ వేరియంట్‌ను రూ.12,999 కి, టాప్ వేరియంట్‌‌ను రూ.15,999 కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక ఇంతకు ముందు లాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై రూ.4,000 డిస్కౌంట్ ఆఫర్ లభించనుంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M34 5G లో 6.46-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M34 5G లో ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. దీని ద్వారా యూజర్‌కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy M34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.