Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy F55 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F55 5G
  • బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన డివైజ్
  • ఇప్పటికే వై-ఫై అలయన్స్ పై లిస్టైన ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై Samsung Galaxy F55 5G ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. సరే, ఓసారి Samsung Galaxy F55 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G బీఐఎస్ లిస్టింగ్

  • Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై SM-E556B అనే మోడల్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ కోడ్ తప్పా, Samsung Galaxy F55 5G కి సంబంధించిన ఇతర వివరాలు ఏమీ తెలియలేదు.
  • Samsung Galaxy F55 5G యొక్క స్పెసిఫికేషన్స్ బీఐఎస్ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు కానీ, త్వరలోనే భారత్ లాంచ్ ఉంటుందనైతే స్పష్టమవుతోంది.
  • రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి Samsung Galaxy F55 5G లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
  • అలాగే, Samsung Galaxy F55 5G యొక్క స్పెసిఫికేషన్స్ ని సోషల్ మీడియా లేదా అధికార వెబ్‌సైట్ ద్వారా టీజ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
  • Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ గత వారం వైఫై అలయన్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ తో పాటు, Galaxy M55 5G, Galaxy C55 5G ఫోన్లు కూడా వైఫై అలయన్స్ పై లిస్ట్ అయ్యాయి.
  • ఈ మూడు ఫోన్లలో Galaxy M55 5G మాత్రమే గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై ఈ డివైజ్ అడ్రెనో 644 జీపీయూ, 2.40 గిగాహెర్ట్జ్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ గల సీపీయూ తో కనిపించింది.
  • వివరాలను బట్టి, Samsung Galaxy M55 5G లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy F55 5G గత మోడల్ Samsung Galaxy F54 5G కి సక్సెసర్ గా రానుంది. ఓసారి Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.