Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వచ్చే అవకాశం
  • 50ఎంపి ఐసోసెల్ జీఎన్3 కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ తో పాటు, గ్లోబల్ గా Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఎస్23 ఎఫ్‌ఈ కి సక్సెసర్‌గా మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఎస్24 ఎఫ్ఈ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 FE కెమెరా వివరాలు (లీక్)

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ The Galaxy Club కథనం ద్వారా రివీల్ అయ్యాయి.

గెలాక్సీ క్లబ్ రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 FE డివైజ్ లో ఎస్24, ఎస్23, ఎస్23 ఎఫ్ఈ లో ఉన్న ప్రైమరీ కెమెరానే ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 FE లో 50ఎంపి ఐసోసెల్ జీఎన్3 1/1.57 ఇంచ్ సెన్సర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఈ కొత్త నివేదిక ద్వారా కేవలం ప్రైమరీ సెన్సర్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇతర సెన్సర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 8ఎంపి టెలీఫోటో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy S24 FE 6.1-ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. భారతీయ వేరియంట్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy S24 FE లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

Samsung Galaxy S24 FE డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 2200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ జూమ్ ఓఐఎస్ టెలీఫోటో లెన్స్, 10ఎంపి సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.