Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A35
  • ఎన్బీటీసీపై లిస్టైన డివైజ్
  • ఏ35 తో పాటు లాంచ్ కానున్న ఏ55

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Galaxy A35, A55 ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Galaxy A35 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. మరోవైపు గెలాక్సీ 35, గెలాక్సీ ఏ55 డివైజెస్ కంపెనీ యొక్క సపోర్ట్ పేజీలో లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Galaxy A35 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Galaxy A35 ఎన్బీటీసీ లిస్టింగ్

  • MySmartPrice Galaxy A35 డివైజ్ ని ఎన్బీటీసీ పై గుర్తించింది. SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో Galaxy A35 లిస్టింగ్ పై కనిపించింది.
  • Galaxy A35 డివైజ్ త్వరలోనే థాయిలాండ్ లో లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • లిస్టింగ్ ద్వారా Galaxy A35 పేరు కూడా ఖరారైంది. 5జీ కనెక్టివిటీ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.