Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SM-A065F/DS
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. మరి, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా డివైజ్‌కి సంబంధించి ఏ వివరాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Samsung Galaxy A06 బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో కనిపించింది. మోడల్ నంబర్, సిమ్ సపోర్ట్ తప్పా, మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

అయితే ఇంతకు ముందు Samsung Galaxy A06 గీక్‌బెంచ్, వై-ఫై అలయన్స్ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. వాటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A06 డివైజ్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోందని ఈ లిస్టింగ్స్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy A06 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ పై స్పష్టత లేదు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన Samsung Galaxy A05 కి సక్సెసర్ గా ఏ06 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. Samsung Galaxy A06 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఓసారి గెలాక్సీ ఏ05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.