రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Jio

హైలైట్స్

  • రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో సంస్థ
  • 90 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి హై-స్పీడ్ డేటా ఆఫర్ చేయనున్న లేటెస్ట్ ప్లాన్
  • రూ.719 ప్లాన్ తో జతగా చేరిన రూ.749 ప్లాన్. దాదాపు అవే బెనిఫిట్స్ అందించడంతో పాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్ సొంతం

భారత్ లో రియలన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. జియో లాంచ్ చేసిన రూ.749 ప్లాన్ తో 2జిబి హై-స్పీడ్ డేటా ప్రతిరోజు లభిస్తుంది. అలాగే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే యూజర్లకు మొత్తం 180జిబి డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర ఎన్నో అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి. సరే ఓసారి రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి బెనిఫిట్స్ ని తెలుసుకుందాం పదండి.

Reliance Jio రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు, రిలయన్ జియో అందిస్తోన్న రూ.749 ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2జిబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న రూ.719 ప్లాన్ మాదిరి ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. అయితే వ్యాలిడిటీ మాత్రం 84 రోజులకు బదులుగా 90 రోజులు అందిస్తుంది. డేటా ప్రయోజనాలతో పాటు, యూజర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి జియో యాప్స్ కి యాక్సెస్ లభిస్తుంది.

రూ.749 ప్లాన్ ఇప్పటికే జియో అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. మైజియో యాప్, పేటీఎమ్, ఫ్రీచార్జ్ ద్వారా కూడా జియో రూ.749 ప్లాన్ ని యూజర్లు రీచార్జ్ చేసుకోవచ్చు.

Reliance Jio Rs.749 Plan Benefits

  • 90 రోజుల వ్యాలిడిటీ
  • 2జిబి డెయిలీ హై-స్పీడ్ డేటా
  • అపరిమిత వాయిస్ కాల్స్
  • అపరిమిత ఎస్ఎంఎస్
  • జియో టీవీ
  • జియో సినిమా
  • జియో క్లౌడ్
  • జియో సెక్యూరిటీ

రిలయన్స్ జియో ఇప్పటికే తన అపరిమిత 5జీ డేటా ప్లాన్ ని అడ్వర్టైజ్ చేస్తోంది. అర్హత గల్గిన 5జీ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ ని వినియోగించుకోవచ్చు. యాక్టివ్ ప్రీపెయిడ్ బేస్ ప్లాన్ రూ.239 లేదా అంతకంటే పైన ప్లాన్ వాడుతోన్న యూజర్లు జియో 5జీ వెల్కమ్ ఆఫర్ కి అర్హులు. మీరు గనుక లేటెస్ రూ.749 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే జియో 5జీ వెల్కమ్ ఆఫర్ కి ఎన్‌రోల్ చేసుకోవచ్చు.

ఇప్పటికి దేశంలో గుజరాత్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, వారణాసి తదితర ప్రముఖ నగరాల్లో జియో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలె ఊక్లా అందించిన నివేదికలో 5జీ స్పీడ్స్ లో ఎయిర్టెల్ కంటే జియో ముందంజలో ఉన్నట్లు తెలిసింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.