Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో Redmi Note 14 సిరీస్ లాంచ్
  • మోడల్ నంబర్ 24115RA8EI
  • 1.5కే 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నుంచి త్వరలో Redmi Note 14 సిరీస్ లాంచ్ కానుంది. రెడ్మీ నోట్ సిరీస్ కు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో షావోమి సంస్థ ఈ సిరీస్‌ను ప్రత్యేకమైన ఫీచర్లతో లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi Note 14 సిరీస్ ఐఎంఈఐ లిస్టింగ్

Redmi Note 14 ఐఎంఈఐ వెబ్‌సైట్ పై 24115RA8EC (చైనా), 24115RA8EG (గ్లోబల్), 24115RA8EI (ఇండియా) మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

Redmi Note 14 Pro డివైజ్ 24094RAD4C (చైనా), 24094RAD4G (గ్లోబల్), 24094RAD4I (ఇండియా) మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

Redmi Note 14 Pro+ డివైజ్ 24090RA29C (చైనా), 24090RA29G (గ్లోబల్), 24090RA29I (ఇండియా) మోడల్ నంబర్లతో ఐఎంఈఐ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

రిపోర్ట్ ప్రకారం, మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న 2409 అంకెలు.. Redmi Note 14 సిరీస్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని సూచిస్తున్నాయి.

Redmi Note 14 సిరీస్ సెప్టెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత 2025 ఆరంభంలో భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది.

Redmi Note 14 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi Note 14 సిరీస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.

చిప్సెట్: Redmi Note 14 Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

బ్యాటరీ: Redmi Note 14 సిరీస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.

ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.