NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Redmi Note 13 Pro 5G; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • తాజాగా ఎన్బీటీసీ పై లిస్టైన Redmi Note 13 Pro
  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi Note 13 Pro

షావోమి సబ్-బ్రాండ్ Redmi తన స్వదేశం చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు రెడ్మీ సంస్థ ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi Note 13 Pro డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ ఎంట్రీ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి Redmi Note 13 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro NBTC లిస్టింగ్

  • Redmi Note 13 Pro థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్ లో 23117RA68G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ఇమేజ్ లో Redmi Note 13 Pro పేరుని గమనించవచ్చు.
  • Redmi Note 13 Pro డివైజ్ 4జీ టెక్నాలజీతో కనిపిస్తోంది. అయితే భారత్ తో పాటు ఇతర దేశాల్లో Redmi Note 13 Pro 4జీ మరియు 5జీ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
  • మోడల్ నంబర్ తప్పితే, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.
  • మరింత సమాచారం కోసం రెడ్మీ నుంచి వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.