Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • మోడల్ నంబర్ 2407FRK8EC
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మీ నుంచి ఈ మేరకు టీజర్ కూడా విడుదలైంది. లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈలోపు బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై Redmi K70 Ultra లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi K70 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 2407FRK8EC అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా ఈ ఫోన్ కనిపించింది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2218 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 7457 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ డివైజ్ ఆక్టా-కోర్ చిప్సెట్ తో వస్తోంది. మదర్‌బోర్డ్ పేరు Rothko అని పేర్కొనబడి ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్ గా ఉంది. మాలి-జీ720-ఇమ్మోర్టాలిస్ ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్ లిస్ట్ పై కనిపించాయి.

వివరాలను బట్టి, Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో రానుందని అర్థమవుతోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌తో వస్తోందని టీజర్ ద్వారా రెడ్మీ సంస్థ కన్ఫర్మ్ చేసింది.

3సీ సర్టిఫికేషన్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ పై 16జిబి ర్యామ్ తో Redmi K70 Ultra కనిపించింది. 24జిబి వరకు ర్యామ్, 1టిబి ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుందని అంచనా వేయవచ్చు.

Redmi K70 Ultra డివైజ్ యొక్క డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు. అయితే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే రెడ్మీ కే70 అల్ట్రా కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.