Redmi: లీకైన K70 Ultra లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • 8టీ ఓఎల్ఈడీ ప్యానెల్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. తాజాగా Redmi K70 Ultra యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీకైంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ వివరాలను చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతేడాది Redmi K60 Ultra ఆగస్టు నెలలో లాంచ్ అయ్యింది. దీన్ని బట్టి, రెడ్మీ కే70 అల్ట్రా ఈ ఏడాది జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi K70 Ultra లో 8టీ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Redmi K70 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ మే 7న లాంచ్ అవుతోంది.

మెమొరీ: Redmi K70 Ultra డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

బ్యాటరీ: Redmi K70 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఓఎస్: Redmi K70 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 Ultra డివైజ్ లో ఐపీ68 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

Redmi K60 Ultra స్పెసిఫికేషన్స్

Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. దీంతో పాటు x7 డిస్ప్లే చిప్ ని కూడా అందించారు.

మెమొరీ విషయానికి వస్తే, Redmi K60 Ultra లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి. రెడ్మీ కే60 అల్ట్రాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 సెన్సర్ ని అందించారు.

ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. Redmi K60 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 Ultra డివైజ్ 162.15 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.49 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.