5జీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న Redmi K50i

హైలైట్స్:

  • జులై 20 న భారత్ లో లాంచ్ కానున్న రెడ్ మీ కే50ఐ
  • 5జీ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి
  • జియోతో కలిసి 5జీ టెస్టింగ్ చేసిన రెడ్ మీ

రెడ్ మీ కంపెనీ కే సిరీస్ లో ఫోన్ లాంచ్ చేసి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి రెడ్ మీ కే50ఐ పేరుతో ఓ ఫోన్ ని లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఫోన్ జులై 20 న భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతుండటంతో కే సిరీస్ అభిమానుల్లో మాంచి ఆసక్తి నెలకొంది. మరి లాంచ్ తర్వాత ఇదే క్రేజ్ ని ఫోన్ కలిగి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఈలోపు ఈ ఫోన్ యొక్క  5జీ ట్రయల్స్ తో పాటు, స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూద్దాం. పదండి.

5G ట్రయల్స్ విశేషాలు

తాజాగా రిలయన్స్ జియో కంపెనీ తో కలిసి 5జీ నెట్వర్క్ లకు సంబంధించిన అన్ని బ్యాండ్ లను రెడ్ మీ కంపెనీ విజయవంతంగా పరీక్షించినట్లు తెలుస్తోంది. 12 రకాల 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేసే తొలి రెడ్ మీ ఫోన్ ఇదే కావడం విశేషం. 4కే స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ వంటి టెస్టులను ఈ ఫోన్ పాసైనట్లు రెడ్ మీ కంపెనీ తెలిపింది. దీంతో 8కే క్వాలిటీ వీడియోలను బఫరింగ్ లేకుండా చూడటంతో పాటు, అంతరాయం లేకుండా గేమ్ లను ఆడేందుకు అవకాశం ఉంటుంది.

Redmi K50i స్పెసిఫికేషన్స్

రెడ్ మీ కే సిరీస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. మిడ్ రేంజ్ ఫోన్ అయిన రెడ్ మీ కే50ఐ ఫోన్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అమర్చారు. కాగా, ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ను ఇందులో అందిస్తున్నారు. ఓసారి కెమెరా విభాగం పై కన్నేద్దాం. ఈ ఫోన్లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో ముందు వైపున 16ఎంపి కెమెరాను అందించారు. 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 13 ఓఎస్ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. రెడ్ మీ కే50ఐ ధర రూ.21,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని సమాచారం.

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ ఫీచర్లను బట్టి, ఇది 5జీ టార్గెటెడ్ ఫోన్ అని అర్థమవుతోంది. కానీ ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే, అన్ని 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయడం, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగి ఉండటం ఈ ఫోన్ కి బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. వీటిని పరిగణలోకి తీసుకుంటే, రెడ్ మీ కే50ఐ ఫోన్ సంబంధిత సెగ్మెంట్ లో ప్రత్యర్థి ఫోన్లకు పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఒక్కసారి ఫోన్ లాంచ్ అయి, ధర, ఇతర వివరాలు తెలిసాక మరింత క్లారిటీ వస్తుంది.