Redmi A3x: రూ.6,999 ధరతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెడ్మీ కొత్త ఫోన్

Highlights

  • భారత్‌లో లాంచైన Redmi A3x
  • రెడ్మీ ఏ3ఎక్స్ ధర రూ.6,999
  • యూనిఎస్ఓసీ టీ603 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi భారత్ లో తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 8ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Redmi A3x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x ధర, లభ్యత, కలర్స్

Redmi A3x స్మార్ట్‌ఫోన్ భారత్ లో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర తెలుసుకుందాం. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ గల ఈ ఫోన్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు.

Redmi A3x స్మార్ట్‌ఫోన్ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్ లో ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ డివైజ్ మిడ్నైట్ బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్స్ లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Redmi A3x స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi A3x స్మార్ట్‌ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్‌డ్రాప్ నాచ్, 720*1650 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi A3x లో యూనిఎస్ఓసీ టీ603 ఆక్టా-కోర్ చిప్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Redmi A3x డివైజ్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

కెమెరా: Redmi A3x స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi A3x లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi A3x లో భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇచ్చారు.

కనెక్టివిటీ: Redmi A3x లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

బరువు, మందం: Redmi A3x డివైజ్ 8.3 మిల్లీ మీటర్ల మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.