NBTC సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Redmi 13C

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • ఎన్బీటీసీ ద్వారా ఖరారైన డివైజ్ పేరు
  • హీలియో జీ85 చిప్ తో వస్తోన్న ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు. తాజాగా Redmi 13C డివైజ్ పేరు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. ఇదొక 4జీ ప్రాసెసర్. కాస్త మెరుగైన ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ బాగా సరిపోతుంది. సరే, ఓసారి Redmi 13C ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

NBTC సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అయిన Redmi 13C పేరు

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా త్వరలో రెడ్మీ నుంచి రాబోవు ఫోన్ Redmi 13C అని కన్ఫర్మ్ అయ్యింది. Redmi 13C డివైజ్ 23106RN0DA అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఇది 4జీ వేరియంట్ అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇదే వేరియంట్ EEC సర్టిఫికేషన్ ని కూడా పొందింది. అయితే ఈ రెండు సర్టిఫికేషన్స్ ద్వారా Redmi 13C యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు. లీక్స్ ద్వారా తెలిసిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: Redmi 13C 4జీ మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. Redmi 13C 5జీ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Redmi 13C లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని గతంలో Xiaomiui రివీల్ చేసింది.
  • Redmi 13C డివైజ్ యొక్క బ్యాటరీ, ర్యామ్, డిస్ప్లే తదితర స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. Redmi 13C డివైజ్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తున్నందున ఓసారి రెడ్మీ 12సీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C లో 6.71-ఇంచ్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 3జిబి/5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 12C లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏజీపీఎస్, బైడూ, గెలీలియో, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12C లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది.