Redmi 13 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి

Highlights

  • జులై 9న భారత్‌లో Redmi 13 5G లాంచ్
  • ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13 5జీ అనే ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G డివైజ్ భారత్ లో జులై 9వ తేదీన లాంచ్ అవుతోంది. తక్కువ ధరలో ఎన్నో ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ప్రొడక్ట్ పేజీ ద్వారా డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి లాంచ్ వివరాలు, ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 5G ధర, లాంచ్ తేదీ

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫర్స్, డీల్స్ కూడా అందించే అవకాశం ఉంది. దీంతో డివైజ్ రూ.10,000 కంటే తక్కువకే లభించవచ్చు.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జులై 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ తో పాటు, షాపింట్ సైట్ అమెజాన్ పై ప్రొడక్ట్ పేజీ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 5G లో 6.6-ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Redmi 13 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Redmi 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.