Redmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • జులై 9న Redmi 13 5G లాంచ్
  • క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వస్తోన్న ఫోన్
  • 5030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Redmi 13 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఈ ఫోన్ జులై 9వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి Redmi 13 5G లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 13 5G లాంచ్ వివరాలు

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జులై 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు లాంచ్ కి ముందు షావోమి సంస్థ Redmi 13 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వస్తోంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తోంది.

Redmi 13 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా మరియు సెకండరీ లెన్స్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi 13 5G డివైజ్ సరసమైన ధరలోనే లాంచ్ కానుంది. ధర రూ.15,000 వద్ద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.