లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు!

Highlights

  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ తో వస్తోన్న Redmi 12 4G
  • Redmi 12 4G అంచనా ప్రారంభ ధర రూ.9,999
  • 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ తో రానున్న Redmi 12 5G

షావోమి సంస్థ భారత్ లో త్వరలోనే Redmi 12 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 1 న ఈ రెండు డివైజెస్ లాంచ్ కానున్నాయి. అవి: Redmi 12 4G, Redmi 12 5G. రెడ్మీ 12ఆర్ ని రీబ్రాండ్ చేసిన Redmi 12 5G ని తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Redmi 12 4G ఇప్పటికే థాయిల్యాండ్ లో లాంచ్ అయ్యింది. డివైజ్ కూడా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుందని బ్రాండ్ ఖరారు చేసింది.

Redmi 12 4G డివైజ్ జేడ్ బ్లాక్, పేస్టల్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. లాంచ్ కోసం వేచి చూస్తున్న తరుణంలో, టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ డివైజ్ ధర వివరాలు షేర్ చేసారు.

లీకైన Redmi 12 4G, Redmi 12 5G ధరలు

టిప్‌స్టర్ ప్రకారం, Redmi 12 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.13,999 నుంచి మొదలవుతుందని సమాచారం. మరోవైపు Redmi 12 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Redmi 12 4G ధర రూ.9,999 తో మొదలవుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 4G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, 70 పర్సెంట్ కలర్ గేముత్, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Redmi 12 4G లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12 4G డివైజ్ లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • రియర్ కెమెరా: Redmi 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Redmi 12 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12 4G డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్-సిమ్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.