6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi 12
  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వచ్చిన ఫోన్
  • ఫోన్ కొనుగోలుపై రూ.1000 ఆఫర్ ప్రకటించిన కంపెనీ

షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ అభిమానులకు నేడు పండుగేనని చెప్పాలి. రెడ్మీని ఏళ్ళుగా ఆదరిస్తోన్న యూజర్ల కోసం సదరు సంస్థ రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లో Redmi 12 4G, Redmi 12 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 4G గురించి తెలుసుకుందాం. Redmi 12 4G డివైజ్ ధర రూ.9,999 తో ప్రారంభమవుతుంది.

Redmi 12 4G ధర

Redmi 12 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. మరోవైపు, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. అయితే ఆఫర్ లో భాగంగా ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో 4జిబి ర్యామ్ మోడల్ ని రూ.8,999 కి, 6జిబి ర్యామ్ మోడల్ ని రూ.10,499 కి సొంతం చేసుకోవచ్చు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ ఎల్సీడీ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • చిప్సెట్: Redmi 12 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: Redmi 12 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi 12 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అందించారు. దీంతో యూజర్ కి అదనపు ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Redmi 12 4G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 27 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • కనెక్టివిటీ: Redmi 12 4G లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi 12 4G డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ53 రేటింగ్ తో రావడం వల్లన డస్ట్, వాటర్ నుంచి పాక్షికంగా ప్రొటెక్షన్ లభించనుంది.