Redmi 12 4G: గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 12 4జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • పాకిస్తాన్‌లో లాంచైన Redmi 12 4G
  • 128జిబి/256జిబి స్టోరేజీ
  • ధర PKR 59,000 (రూ.17,900)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక 4జీ ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi 12 4G పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ లో విడుదలైంది. తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ సూట్ అవుతుంది. ఇకపోతే, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ 12 4జీ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 12 4G ధర

Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ ధర పాకిస్తాన్ లో ఎలా ఉందో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర PKR 59,000 (సుమారు రూ.17,900) గా ఉంది. రెడ్మీ 12 4జీ డివైజ్ స్కైలైన్ సిల్వర్ మరియు పయనీర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Redmi 12 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 12 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Redmi 12 4G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ ని ఆఫర్ చేశారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 12 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi 12 4G లో ఐపీ54 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.