Realme V60, Realme V60s: 32ఎంపి కెమెరాతో లాంచైన రియల్మీ కొత్త ఫోన్లు

Highlights

  • చైనాలో లాంచైన Realme V60 సిరీస్
  • 5000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి తాజాగా వీ-సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Realme V60, Realme V60s పేర్లతో వచ్చిన ఈ డివైజెస్ చైనా మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. వీటిని ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, 8జిబి ర్యామ్, 32ఎంపి రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme V60, Realme V60s ధర

Realme V60 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1199 యువాన్లు (సుమారు రూ.13,800) గా ఉంది.

Realme V60 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,100) గా నిర్ణయించారు.

Realme V60s డివైజ్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1399 యువాన్లు (సుమారు రూ.16,100) గా ఉంది.

Realme V60s 8జిబి+256జిబి మోడల్ ధరను 1799 యువాన్లు (సుమారు రూ.20,700) గా నిర్ణయించారు.

Realme V60 మరియు Realme V60s స్మార్ట్‌ఫోన్లు స్టార్ గోల్డ్ మరియు టర్కాయిస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. చైనాలో రియల్మీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Realme V60 మరియు Realme V60s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme V60 మరియు Realme V60s ఫోన్లలో 6.67-ఇంచ్ హెచ్డీ+ (720*1604 పిక్సెల్స్) స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 625 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: రియల్మీ వీ60, వీ60ఎస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme V60, Realme V60s ఫోన్లు 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.

కెమెరా: Realme V60, Realme V60s డివైజెస్ లో 32ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే సెకండ్ సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.

బ్యాటరీ: Realme V60, Realme V60s డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Realme V60, Realme V60s ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.