Realme P1 Pro 5G: కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Highlights

  • భారత్ లో Realme P1 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన పీ1, పీ1 ప్రో
  • P1 Pro 5G బరువు: 186 గ్రాములు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 Pro 5G గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 ప్రో 5జీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 6.7-ఇంచ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme P1 Pro 5G ధర, సేల్ వివరాలు, కలర్ ఆప్షన్స్

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రియల్మీ పీ1 ప్రో 5జీ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Realme P1 Pro 5G కొనుగోలుపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ చెల్లుబాటు అవుతుంది. దీంతో బేస్ మోడల్ రూ.19,999 కి, టాప్ వేరియంట్ రూ.20,999 కి లభిస్తుంది.

ఏప్రిల్ 22న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెడ్ కలర్ ఆప్షన్ యొక్క లిమిటెడ్ సేల్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ పై అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్యారెట్ బ్లూ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Realme P1 5G కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.