Realme P1 Pro 5G: 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 ప్రో 5జీ

Highlights

  • భారత్‌లో Realme P1 Pro 5G 12జిబి లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్
  • 12జిబి మోడల్ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme P1 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme P1 మరియు Realme P1 Pro 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme P1 Pro 5G యొక్క 12జిబి వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme P1 Pro 5G ధర, లభ్యత

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. ఇతర వేరియంట్స్ ధరలు తెలుసుకుందాం.

Realme P1 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీనిక్స్ రెడ్ మరియు ప్యారట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.