Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్?

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నిన్నే Realme P1 5G కూడా లాంచ్ అయ్యింది. మోటో జీ64 5జీ రూ.14,999 ప్రారంభ ధరతో లాంచైంది. రియల్మీ పీ1 5జీ రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తుంది. మోటో జీ64 మరియు రియల్మీ పీ1 ఫోన్లు ఒకే ధర శ్రేణిలో వచ్చాయి కాబట్టి, రెండింట్లో ఏది ఉత్తమమో, ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

మోటో జీ64 5జీ vs రియల్మీ పీ1 5జీ

డిస్ప్లే

Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

మోటో జీ64 5జీ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

రియల్మీ పీ1 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

మోటో జీ64 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

ఓఎస్

రియల్మీ పీ1 5జీ మరియు మోటో జీ64 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి.

కెమెరా

Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Moto G64 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి డెప్త్ మరియు మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

Moto G64 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto G64 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

ధర

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

రియల్మీ పీ1 5జీ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 మరియు 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ ని రియల్మీ అందిస్తోంది.

డిస్కౌంట్ తర్వాత Realme P1 5G డివైజ్ ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి.

Moto G64 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.

Moto G64 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.