Realme P1 5G: 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 5జీ

Highlights

  • నేడు భారత్‌లో రియల్మీ పీ1 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన పీ1, పీ1 ప్రో డివైజెస్
  • 45W ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన పీ1 5జీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో కొత్తగా పీ-సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 5G స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ54 రేటింగ్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme P1 5G ధర, సేల్ వివరాలు

Realme P1 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

రియల్మీ పీ1 5జీ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 మరియు 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ ని రియల్మీ అందిస్తోంది.

డిస్కౌంట్ తర్వాత Realme P1 5G డివైజ్ ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme P1 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని అందించారు.

ఓఎస్: Realme P1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 4 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme P1 5G డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, మినీ క్యూప్సూల్ 2.0, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.