NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Realme Note 50

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • ఎన్బీటీసీ సైట్‌లో లిస్టైన డివైజ్
  • 4890mAh బ్యాటరీతో రానున్న ఫోన్

త్వరలోనే Realme Note సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ లైనప్ లో కొన్ని ఫోన్లను తీసుకొచ్చేందుకు Realme ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Realme Note 50 డివైజ్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే Realme Note 50 లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే 5జీ కనెక్టివిటీ గురించి లిస్టింగ్ లో ప్రస్తావన లేదు. దీంతో Realme Note 50 4జీ కనెక్టివిటీతో వస్తోందని అంచనా వేస్తున్నారు.

Realme Note 50 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. ఈ లిస్టింగ్ ద్వారా Realme Note 50 డివైజ్ 4890mAh బ్యాటరీతో వస్తున్నట్లు రివీల్ అయ్యింది. అంతేకాదు, లిస్టింగ్ ద్వారా 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కూడా పేర్కొనబడింది. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సరే, ఓసారి Realme Note 50 ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 NBTC సర్టిఫికేషన్ వివరాలు

  • రియల్మీ సంస్థ త్వరలో లాంచ్ చేయబోయే Realme Note 50 డివైజ్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Realme Note 50 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Realme Note 50 డివైజ్ RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • 2023 నవంబర్ లో ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో ఒక డివైజ్ కనిపించింది.
  • త్వరలోనే Realme Note 50 కి సంబంధించి రియల్మీ నుంచి అధికార ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈలోపు Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ కార్నర్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 808 ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్890 పెరిస్కోప్ టెలీఫోటో 3x లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ 3.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Realme GT 5 Pro డివైజ్ 161.72 మి.మీ పొడవు, 75.06 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. గ్లాస్ వేరియంట్ 224 గ్రాముల బరువు ఉంటుంది.