Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • జనవరి 24న లాంచ్ కానున్న Realme Note 50

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే లాంచ్ కంటే ముందు Realme Note 50 యొక్క లైవ్ ఇమేజెస్ తో పాటు స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ, డిజైన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

జనవరి 24న లాంచ్ అవుతోన్న Realme Note 50

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై Realme Note 50 పోస్టర్ షేర్ చేశారు.
  • అలాగే Realme Note 50 జనవరి 24 న లాంచ్ అవుతోందని టిప్‌స్టర్ గుగ్లాని తెలిపారు.
  • టిప్‌స్టర్ గుగ్లాని షేర్ చేసిన ఇమేజెస్ లో డివైజ్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్స్ లో కనిపిస్తోంది.
  • అలాగే Realme Note 50 యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ కూడా ఇమేజ్ క్రింద కనిపిస్తున్నాయి.

Realme Note 50 డిజైన్

  • లీకైన Realme Note 50 ఇమేజెస్ ని బట్టి, డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఇంకా Realme Note 50 లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంది.
  • Realme Note 50 డివైజ్ ఫ్లాట్ బాడీ కలిగి ఉంది. ఈ ఫోన్ 7.99 మి.మీ మందం ఉంటుంది. ఈ డివైజ్ ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Note 50 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యు-షేప్డ్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Note 50 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Note 50 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme Note 50 లో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 4,890 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.