గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • RMX3750 మోడల్ నంబర్ తో కనిపించిన Realme Narzo 60 5G
  • 64జిబి/128జిబి స్టోరేజీతో రానున్న Realme Narzo 60 5G
  • Realme 11 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న Realme Narzo 60 5G

Narzo 50 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత, ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, Narzo 60 సిరీస్ పై పని చేస్తోంది. అయితే కంపెనీ ఈ విషయంపై ఇంకా ఏ ప్రకటన వెలువరించలేదు. అయితే తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Realme Narzo 60 5G డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా ర్యామ్, చిప్సెట్ తదితర వివరాలు తెలిసాయి. Realme Narzo 60 5G డివైజ్ 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్, గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme Narzo 60 5G గీక్ బెంచ్ లిస్టింగ్

  • డివైజెస్ యొక్క ప్రాసెసర్ పెర్ఫామెన్స్, జీపీయూ బెంచ్ మార్క్ టెస్ట్ లను నిర్వహించే వేదిక గీక్ బెంచ్. ఈ వెబ్ సైట్ రాబోవు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ప్రాసెసర్, ర్యామ్, ఓఎస్ వివరాలను తెలియజేస్తుంది. దీని వల్లన మొబైల్ ఫోన్ రిలీజ్ కి ముందే ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసే అవకాశం ఉంది.
  • Realme Narzo 60 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 714 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1868 పాయింట్లు సాధించింది.
  • Realme Narzo 60 5G యొక్క గీక్ బెంచ్ లిస్టింగ్ ని తొలుత MySmartPrice గుర్తించింది.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ 4జిబి లేదా 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • ఈ ఫోన్ 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా.
  • Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • అయితే Realme Narzo 60 5G డివైజ్ Realme 11 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు రియల్మీ 11 ప్రో 5జీ, రియల్మీ 11 ప్రో+ డివైజెస్ మాత్రమే భారత్ లో లాంచ్ అయ్యింది. ఇంకా రియల్మీ 11 5జీ లాంచ్ కాలేదు.

Realme Narzo 60 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Narzo 60 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Realme Narzo 60 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది.
  • సెల్ఫీ కెమెరా: Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా.
  • చిప్సెట్: Realme Narzo 60 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు.
  • స్టోరేజీ: Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం.
  • ఓఎస్: Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Realme Narzo 60 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది.