Realme: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన GT Neo 6 SE

Highlights

  • చైనాలో Realme GT Neo 6 SE లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా తన సొంత మార్కెట్ చైనాలో GT Neo 6 SE డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఇంకా భారత్ లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Realme GT Neo 6 SE లో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఓసారి జీటీ నియో 6 ఎస్ఈ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 6 SE ధర

Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.19,500) గా ఉంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,900) గా ఉంది.

16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,000) గా ఉంది.

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2399 యువాన్లు (సుమారు రూ.27,500) గా ఉంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ 1.5కే రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.8GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ ఉపయోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE డివైజ్ చైనాలో నాలుగు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి/512జిబి.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఐఎంఎక్స్315 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 SE లో ఐపీ65 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.